ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకుల దారుణం

ఆమె పాట్నా ఎక్సుప్రెస్ రైలులో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని తన బంధువుల ఇంటికి బయలుదేరింది. పెద్దపల్లి వద్ద స్టాప్ లేకపోవడంతో రామగుండంలోనే దిగింది. రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో దిగిన ఆమెను ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత వారి నుండి తప్పించుకున్న బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రైలు పట్టాలపై మృతదేహాలు
అనంతపురం జిల్లా హిందూపురం ఆటో నగర్ వద్ద రైలు పట్టాల పైన యువతీ, యువకుల మృతదేహాలు లభ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హిందూపురం ఆటో నగర్ వద్ద రైలు పట్టాలపై మృతదేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications