చిన్నారిని చంపేసి మూట కట్టి బావిలో పడేశారు

Kidnapped girl killed in Mahaboobnagar district
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో టీచర్స్ కాలనీ నుంచి బుధవారం అపహరణకు గురైన చిన్నారి శ్రియ(6)ను దుండగులు హత్య చేశారు. ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం - నాగరాజు, రజితల కుమార్తె శ్రియను వారి ఇంట్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తున్న యాకూబ్, బుధవారం ఉదయం ఇంట్లోనుంచి తీసుకువచ్చి స్నేహితులు అమీర్, నసీమ్‌లకు అప్పగించాడు. వారు శ్రియను ఆటోలో ఎత్తుకెళ్లారు.

భయపడిన పాప అరవడంతో, కిడ్నాపర్లు ఆమె గొంతునులిమి, తువ్వాలతో నోరు మూసేశారు. దీంతో ఊపిరాడక ఆటోలనే చిన్నారి ప్రాణాలు విడిచింది. పాప చనిపోయిందని గ్రహించిన కిడ్నాపర్లు, మృతదేహాన్ని ఓ గోనెసంచిలో మూటగట్టి మహబూబ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని అడ్డాకుల మండలం పొల్కంపల్లి శివారులో పాడుబడిన బావిలో పడేశారు. యాకూబ్‌ను అనుమానించిన పోలీసులు గురువారం రెండోదఫా విచారించగా అసలు విషయం చెప్పాడు. దీంతో, శ్రియ తల్లిదండ్రులను, యాకూబ్‌ను తీసుకుని పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని పడేసిన బావివద్దకు వెళ్లి పరిశీలించారు.

నెలరోజుల కిందటే ఆపరేటర్‌గా చేరిన యాకూబ్, తన స్నేహితుడు, ఆటో నడిపిస్తున్న నసీం, అమీర్‌లతో కలిసి కుట్రపన్నాడు. రెండురోజుల కిందటే, శ్రీయ చదువుతున్న పాఠశాల, ఇంటి పరిసరాలను పూర్తిగా వివరించాడు. ఆమెను కిడ్నాప్ చేసినందుకు గాను చెరో రెండు లక్షలిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ ఉండని సమయాన్ని ఎంచుకుని, బుధవారం ఉదయం 11.30కి శ్రీయను ఎత్తుకెళ్లారు. ముందుగా వేసుకున్న పథ కం ప్రకారం, జిల్లా కేంద్రం నుంచి బయలుదేరిన ఆటోను క్రిస్టియన్ పల్లి ద్వారా అడ్డాకుల మండలం పోల్కంపల్లికి మళ్లించి, అక్కడ రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన బావిలో పడేశారు.

అనంతరం కిడ్నాపర్లు, మహబూబ్‌నగర్‌కు తిరిగి వచ్చి, 10 లక్షలు ఇవ్వాలం టూ పాప తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. బుధవారమే మూడుసార్లు ఫో న్ చేసిన కిడ్నాపర్లు పోలీసులనూ ముప్పుతిప్పలు పెట్టారు. ఇంట్లోనే ఆపరేటర్‌గా పనిచేస్తున్న యాకుబ్‌ను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+