జగన్‌కు అవన్నీ బాగా తెలుసు: నారాయణ ఎద్దేవా

Narayana - YS Jagan
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ మోడరన్ డెకాయిట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గురువారం మండిపడ్డారు. ఆయన అనంతపురం జిల్లాలో మాట్లాడారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి నివాస భవనం, సెక్రటేరియెట్‌కు రహస్య మార్గాల్లో ఎలా వెళ్లవచ్చో, దొడ్డిదారిన పారిశ్రామికవేత్తలను ఎలా కలుసుకోవచ్చో ప్రజలను, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని ఎలా లూటీ చేయవచ్చో ఆయనకు బాగా తెలుసునని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులు పదవులకు రాజీనామా చేసి తమ నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ ఆస్తుల కేసులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి నిందితురాలిగా ఉన్నారని, హోం మంత్రి పదవిలో కోనసాగడంపై ఆమె పునరాలోచించుకోవాలన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న సబిత దగ్గర ఆత్మవంచన చేసుకొని డిజిపి దినేష్ రెడ్డి సెల్యూట్ చేస్తూ ఎలా పని చేయగలుగుతారని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సిపిఐ వ్యతిరేకించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, అలాగని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. ఏనాడూ సబ్‌ప్లాన్‌ను వ్యతిరేకించలేదని, కావాలంటే వెంకటేశ్వర స్వామి వద్దనైనా, బహిరంగ సభల్లోనైనా, ఇంకెక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+