నో పాలిటిక్స్ ప్లీజ్! నాన్న చూసుకుంటారు: నారా లోకేష్

Lokesh - Chandrababu Naidu
చిత్తూరు: రాజకీయాలను నాన్న చూసుకుంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురువారం అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో హెరిటేజ్ డెయిరీ తరపున పాడి రైతుల సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి లోకేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం విమానాశ్రయం వద్ద, సాయంత్రం తిరుపతిలోని హోటల్ వద్ద లోకేష్‌ను పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు.

ఈ సందర్భంగా పలువురు పార్టీ వ్యవహరాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా లోకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. తాను డెయిరీ పనిగా వచ్చానని, ఇప్పుడు రాజకీయాలు వద్దని, తన తండ్రి పాదయాత్ర కూడా ముగుస్తోందని, ఇక ఆయన ఫ్రీగా ఉంటారని, ఆయనే చూసుకుంటారని నాయకులకు చెప్పారు.

ఆయన్ను కలిసిన వారిలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ తదితరులు ఉన్నారు. ఆయన పీలేరు పర్యటనను ముగించికొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

కాగా, ఇటీవల నారా లోకేష్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాలలో తిరిగి పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చలు జరిపారు. అయితే, గురువారం ఆయన కంపెనీ పని మీద వచ్చిన కారణంగా రాజకీయ చర్చలకు తిరస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+