అపైర్: భర్తను హత్య చేయించిన భార్య అరెస్టు

Woman arrested in her husband murder case
చిత్తూరు: భర్తను హత్య చేయించిన ఓ మహిళను చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఆమె తన భర్తను హత్య చేయించింది. ఆమెకు సహకరించిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాటు తుపాకీతో పాటు ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు విఆర్వోగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రిని హత్య చేసిన కుమారుడు

కన్న తండ్రినే ఓ యువకుడు పొట్టన పెట్టుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఓ కుమారుడు తన కన్న తండ్రిని హత్య చేశాడు. కృష్ణా జిల్లా చందర్లుపాడు మండలం తొర్లపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వడదెబ్బకు ఇద్దరు మృతి

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

రైలు పట్టాలపై మృతదేహాలు

అనంతపురం జిల్లా హిందూపురం ఆటోనగర్ వద్ద రైలు పట్టాలపై ఓ యువతి, ఓ యువకుడి మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ మృతి దేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. యువతీయువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

రిమ్స్‌లో గర్భిణీ మృతి

శ్రీకాకుళంలోని రిమ్స్ ప్రభుత్వాస్పత్రిలో ఓ గర్బిణి శుక్రవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్యం వల్లే గర్భిణి మృతి చెందిందని బంధువుల ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

పసికందు హత్య, తండ్రి దారుణం

కర్నూలులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మాయమైన పసికందు హత్యకు గురైంది. కన్నతండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కన్న తండ్రి పసికందుకు రాయి కట్టి నదిలోకి విసేరేశాడు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిందని ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హంద్రీనివాలో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అమ్మాయి ఆత్మహత్యయత్నం

హైదరాబాద్నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో శుక్రవారం పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ యువకుడి లైంగిక వేధింపులు తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+