భయం-అభయం: నరేంద్రమోడీపై నితీష్‌కుమార్ లెక్కలు!

అయితే, బిజెపి మాత్రం మోడీ ప్రధాని రేసులో లేరని చెప్పందుకు ఇష్ట పడటం లేదు. ప్రస్తుతం మోడీకి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉంది. దీనిని ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. మోడీ ప్రధాని అభ్యర్థి అయితే బిజెపికి లాభమని భావిస్తున్నారు. అందుకే నితీష్ ఒత్తిడికి బిజెపి లొంగడం లేదనే చెప్పవచ్చు. నితీష్ వ్యాఖ్యలకు పరోక్షంగా ఘాటుగానే స్పందించింది. దీంతో ఎన్డీయేకు జెడి(యు) దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, మోడీని నితీష్ ప్రధానంగా లక్ష్యం చేసుకోవడానికి రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. మొదటి నుండి మోడీకి వ్యతిరేకమే అయినా ఇటీవల రాజకీయ కారణాల వల్ల నితీష్ మరింత దూకుడు పెంచి ఉంటారంటున్నారు. రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన జెడి(యు) ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మోడీని ఢీకొనడం ద్వారా రాష్ట్రంలోని దాదాపు పదహారు శాతం మైనార్టీలను తమ వైపుకు తిప్పుకోవచ్చునని జెడి(యు) భావిస్తోందని అంటున్నారు.
మొదటి నుండి మోడీని వ్యతిరేకించడానికి ఇదే ప్రధానమైన కారణమంటున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థి రేసులో ముందున్న నేపథ్యంలో ఆయనను వ్యతిరేకించడం ద్వారా అల్పసంఖ్యాక వర్గాలను నితీష్ మరింత ఆకట్టుకోవచ్చునని భావిస్తుండవచ్చునని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రధాని పీఠంపై నితీష్ కుమార్ కూడా కన్నువేశారు. యూపిఏ కూటమిలో ఉంటే నితీష్‌కు అవకాశం ఎలాగూ రాదు.
అందుకే ఆయన మోడీని వ్యతిరేకిస్తూనే ఎన్డీయే కూటమిలో ఉంటున్నారని చెప్పవచ్చు. మోడీనే అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన యూపిఏ వైపు వెళ్లినా వెళ్లవచ్చునని అంటున్నారు. అలా కాకున్నా మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్‌లో కీలకంగా ఎదిగి.. ఆ ఫ్రంట్ల నుండి ప్రధాని రేసులో ఉండవచ్చునని అంటున్నారు. మోడీని వ్యతిరేకుస్తున్నందు వల్ల నితీష్‌ను ఆమోదించే పార్టీలు ఉన్నాయి. యూపిఏ, ఎన్డీయేతర ఫ్రంట్‌లు తమకు అనుకూలంగా ఉన్నవైతే జెడి(యు) అటు వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications