బాలిక రేప్‌పై నిరసన: మహిళ కొట్టిన పోలీసాఫీసర్

Delhi Map
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారుల్లోని ఓ మహిళపై పోలీసు చేయి చేసుకున్నాడు. బాలిక కొనప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. మహిళపై చేయి చేసుకున్న అసిస్టింటే పోలీసు కమిషనర్ బానీ సింగ్ అహ్లావత్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఓ మీడియా సంస్థ ప్రతినిధితో చెప్పారు.

కాంగ్రెసు నేతలు సందీప్ దీక్షిత్, ఎకె వాలియా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆస్పత్రి వద్ద తీవ్ర నిరసన వ్యక్తమైంది. శుక్రవారం ఉదయం నుంచి ఆర్వింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిరసనల సందర్భంగా ఓ పోలీసాఫీసర్ మహిళపై చేసుకున్న సంఘటన చిత్రం బయటకు వచ్చింది.

బాలికను ఏప్రిల్ 15వ తేదీన అపహరించి, ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా దుండగుడు ఫ్లాట్‌లో బందీగా ఉంచి కిరాతకచర్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల వయస్సు గల ఆ దుర్మార్గుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్‌లో బాలిక కుటుంబం ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్నాడు. అతను బాలికను బందీ చేసి రెండు రోజుల పాటు కిరాకతమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆమెను రక్షించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కేసును మాయ చేయాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ కూతురు అదృశ్యంపై ఫిర్యాదు చేస్తే కూడా పోలీసులు తీసుకోలేదని బాలిక తండ్రి చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+