అప్పుడే చెప్పా: జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ

Balakrishna
హైదరాబాద్: ఫ్లెక్సీ వ్యవహారంపై తీవ్ర పరిణామాలుంటాయని తాను ఇది వరకే చెప్పానని తెలుగుదేశం పార్టీ నాయకుడు, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. ఫ్లెక్సీల్లో తన బొమ్మను వాడుకోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్‌ ఖండించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం హెచ్చరించారు. ఫ్లెక్స్లీపై పరిణామాలుంటాయని తాను ఇది వరకే చెప్పానని, అయినా తాను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.

తాను అనవసరమైన విషయాల గురించి మాట్లాడబోనని, వ్యక్తులు గురించి కూడా మాట్లాడబోనని ఆయన చెప్పారు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ వైఖరి మారలేదని అర్థమవుతోంది. హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల బాధితులను బాలకృష్ణ శనివారంనాడు పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఆయన పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

బాధితుల కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సహాయంగా ఆటోలను అందించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అంధ విద్యార్థుల పాఠశాలలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.

మహిళలపై దాడులను అరికట్టడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బాలకృష్ణ ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలను కాపాడుకోవడంలో తప్ప శాంతిభద్రతల విషయంలో శ్రద్ధ చూపడం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు జరగడం దారుణమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+