సిటీకీ గాలి: జగన్ కేసులో సిబిఐతో రెవెన్యూ అధికారులు

అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూర్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఎఎంసి కేసును బెంగళూర్ సిబిఐ విచారిస్తోంది. ఓఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెవెన్యూ అధికారులు శనివారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో చేతులు మారిన భూముల వివరాలను సిబిఐ రెవెన్యూ అధికారులను సిబిఐ అధికారులు అడిగి తెలుకుంటున్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులను కూడా జగన్ కేసులో సిబిఐ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో మరిన్ని చార్జిషీట్లను దాఖలు చేయడానికి సిబిఐ సన్నాహాలు చేసుకుంటుంది. ఇటీవల సిబిఐ దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాలుగో నిందితురాలిగా చేర్చింది.












Click it and Unblock the Notifications