తెరాసకు లగడపాటి రిప్లై: ఆంధ్రపై కక్ష: టిజి వెంకటేష్

Lagadapati and TG venkatesh
విజయవాడ/ గుంటూరు/ హైదరాబాద్: ఖమ్మం జిల్లా బయ్యారం గనులు ప్రజల ఆస్తి అని, విశాఖకు ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని తరలించడాన్ని ఎవరూ ఆపలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఉక్కు తరలింపుపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుటుంబమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఖనిజ సంపద గురించి మాట్లాడే హక్కు కెసిఆర్‌కు లేదని ఆయన అన్నారు.

తెరాస నేతలకు ఉన్నది తెలంగాణపై ప్రేమ లేదని, ఆంధ్రావారిపై కక్ష ఉందని మంత్రి టిజి వెంకటేష్ ఆరోపించారు. శనివారం ఉదయం గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించి ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా చేస్తే తెరాస నేతలు నోరు మెదపలేదని, అయితే, బయ్యారం గనులపై రాద్ధాంతం చేస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనులను కేటాయించడంలో తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడే ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం గనులు కేటాయిస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.

బయ్యారం గనులపై తెలుగుదేశం, తెరాస రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. అందుకే బయ్యారం గనులను తెలంగాణతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్నాయని ఆయన శనివారం విమర్శించారు. అధికారుల అక్రమ గనుల తవ్వకంపై ఆ రెండు పార్టీల నాయకులు ఎందుకు స్పందించరని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+