యువతిపై అత్యాచారం: ప్రేమ జంట ఆత్మహత్య

Suicide
సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని జహీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కీచకపర్వం చోటు చేసుకుంది. కొహిర్ మండలానికి చెందిన 18 ఏళ్ల యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లాలోని కాజీపేటలో శనివారం ఉదయం రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు ఇంజనీరింగ్ విద్యార్థులు కుషాల్‌కుమార్, వినోదినిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

యువతి గొంత కోసిన ప్రేమోన్మాది

వరంగల్ జిల్లాలోనే మరో దారుణం చోటు చేసుకుంది. రమేష్ అనే యువకుడు సరస్వతి అనే యువతి గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో అతను ఆమె గొంతు కోశాడు. దాంతో సరస్వతిని ఆస్పత్రిలో చేర్చారు. వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మహిళపై దాడి

కర్నూలుజిల్లాలోని లక్ష్మీనగర్‌లో ఓ మహిళపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు.

ఇద్దరు చిన్నారుల అదృశ్యం

హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. నిషా, రాజేంద్రకుమార్ అనే చిన్నారులు శుక్రవారం ఆలయానికని వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం శంషాబాద్‌లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+