ప్రమాదం: మహిళా టెక్కీ మృతి, నలుగురికి గాయాలు

తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో కృష్ణా జిల్లాలోని కూచిపూడి నుంచి వంశీకృష్ణ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు వంశీ కారును నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని కారు ఢీకొన్నట్లు వారు తెలిపారు.
వంశీ భార్య శిరీష (30) అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. వంశీ, అతని తల్లి, పిల్లలు గాయపడ్డారు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్ అశోక్ వర్ధన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది.
ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఐదో జాతీయ రహదారి దక్షిణ బైపాస్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications