వైయస్ ఇంట్లోనే అవినీతి వేళ్లు, ముడుపులు: బాబు

ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) అధిపతి గాలి జనార్దనరెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీర్పుని ఆయన స్వాగతించారు. తమ పార్టీ పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైయస్ రాజశేఖర రెడ్డి కర్ణాటక, ఆంధ్రా ర్రాష్టాల్లో అక్రమ మైనింగ్ సాగించారని, ర్రాష్టాల సరిహద్దులనే చెరిపివేశారని ఆయన అన్నారు. గాలి ఐదేళ్లలో 60 వేల కోట్ల ఖనిజ సంపదను దోచుకున్నారని, దీనిపై అప్పట్లోనే తమ పార్టీ ఉద్యమాలు చేసిందని ఆయన అన్నారు.
మాకవరపాలెంలో 'అన్‌రాక్' కోసం రైతులను కూలీలుగా మార్చారన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
వికలాంగుల పెన్షన్‌ని రూ.1500 కు పెంచుతామన్నారు. పేద పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, పాదయాత్రకు 200 రోజులు పూర్తయిన సందర్భంగా తా మరం గ్రామంలో చంద్రబాబు.. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.












Click it and Unblock the Notifications