చైనాను కుదిపేసిన భూకంపం: 56 మంది మృతి

శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో లూషన్ కౌంటీ కొండ ప్రాంతంలో భూకంపం వచ్చింది. పలు భవనాలు కూలిపోయాయి. ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపంలో 12 మంది మరణించారని, వంద మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.
భూకంపం వల్ల సిచౌన్ ప్రొవిన్షియల్ రాజధాని చెంగ్డులో భవనాలు కంపించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయాన్ని గంటపాటు మూసేశారు. భూకంపం వచ్చి లూషన్‌లో 1.5 మిలియన్ల జనాభా ఉంటుంది. పర్వతాలతో నిండి ఉంటుంది. అది టిబెట్ పీఠభూమికి దారి తీస్తుంది.
లూషన్ కౌంటీ కూలిపోయిన భవనాల ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications