కాశీనే గతి: యాత్రపై ఆనం, కెసిఆర్‌కి పొంగులేటి సవాల్

యాత్రలు చేస్తున్న వారికి కాశీయాత్రే గతి అవుతుందన్నారు. అమ్మహస్తంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం మొండి హస్తమని చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదమన్నారు. రాజకీయ విమర్శలు ఎదుర్కొనే ఆత్మస్థైర్యం తనకు ఉందన్నారు.
కెసిఆర్‌కు పొంగులేటి సవాల్
బయ్యారం గనుల అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు. బయ్యారం గనులపై కెసిఆర్ అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కెసిఆర్ బయ్యారం పాట పాడుతున్నారన్నారు. బయ్యారం గనులు, పరిశ్రమ విషయంలో తెలుగుదేశం, తెరాసలు గొడవ పడుతున్నాయని, ఈ గొడవ వల్ల ఉక్కు ఫ్యాక్టరీ వెనక్కి పోతే వారిదే బాధ్యత అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని బయ్యారంలోనే నెలకొల్పుతామని చెప్పారు. బయ్యారం గనుల కేటాయింపుపై కెసిఆర్ తమతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications