'తాగుబోతు ఏం మాట్లాడతారో? వైయస్ దోపిడీలో భాగం'

చంద్రబాబును కెసిఆర్ విమర్శలు చూస్తుంటే ఆయన తాగుబోతు బుద్ధి, విధానం అర్థమవుతోందన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ డబ్బులు సంపాదించుకున్నారని, కుటుంబానికి పదవులు అప్పగించారని, దీంతో ఆయనకు మెంటల్ వచ్చిందన్నారు. ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలన్నారు. కాంగ్రెసు, కెసిఆర్ దొందు దొందేనని, కాబట్టి కెసిఆర్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించి ప్రభుత్వ పరంగా మంచి ట్రీట్‌మెంట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు.
చంద్రబాబును విమర్శిస్తున్న కెసిఆర్ ఆయన హయాంలోనే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎలా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన ఒక్కడే తెలంగాణ గడ్డపై పుట్టినట్లుగా మాట్లాడుతున్నారని, నీచంగా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. తెలంగాణవాదం పేరుతో కొడుకు, కూతురు, అల్లుడు ఇలా కుటుంబ సభ్యులందర్నీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఆరు నెలలకోసారి లేచి ఏదో మాట్లాడుతుంటారన్నారు.
తమ నేత నిత్యం ప్రజల్లో తిరుగుతు సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. కెసిఆర్ మాత్రం ఆరు నెలలకోసారి లేచి మూడు పూటలా తాగి ఏదేదో మాట్లాడుతుంటారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో కెసిఆర్ కుటుంబం కూడా ఒకటి అని దుయ్యబట్టారు. కెసిఆర్ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయాలని కెసిఆర్ ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు.
తెరాస ఫాంహౌస్ పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జైలు పార్టీ అని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి దోపిడీలో కెసిఆర్‌కు భాగముందన్నారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్న వైయస్ ఏమయ్యారో అందరికీ తెలుసునన్నారు. ముడుపులు తీసుకునే కెసిఆర్ అప్పుడు బయ్యారం గనుల గురించి మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులుగా పని చేసిన తెరాసకి వైయస్ దోపిడీలో భాగం ఉందన్నారు.
కిరణ్‌కు మనసంతా ఆంధ్రా పైనే: కెటిఆర్
హైదరాబాదులోనే పుట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనసు మాత్రం ఆంధ్రా పైనేనని తెరాస సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బయ్యారం ఉక్కు సహా తెలంగాణ ప్రాంతంలోని ఏ ఖనిజాన్ని ఇతర ప్రాంతానికి తీసుకు వెళ్లనిచ్చేది లేదన్నారు.












Click it and Unblock the Notifications