టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూత

ఇతను గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. బ్రాహ్మణయ్య మృతితో తెలుగు దేశం పార్టీ శ్రేణులు అందరూ విషాదంలో మునిగిపోయారు. బ్రాహ్మణయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం. గ్రామస్థాయి నుండి అతను అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎంపిగా గెలుపొందారు.
కలుపుగోలు వ్యక్తిగా, మచ్చలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. జనతా పార్టీ నుండి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1994లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా, 199లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2009లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ద ప్రసాద్ పైన విజయం సాధించారు.
అంబటి బ్రాహ్మణయ్య కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడిగా తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన ఇటీవలి వరకు వ్యవసాయం చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications