ఎమ్మెల్యే మృతికి హరి సంతాపం, అంత్యక్రియల్లో బాబు

Harikrishna - Chandrababu Naidu
హైదరాబాద్/విశాఖ/విజయవాడ: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి పార్టీకి తీరని లోటు అని రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆదివారం అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే బ్రాహ్మణయ్య హైదరాబాదులోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి హరికృష్ణ సంతాపం తెలిపారు. కష్టకాలంలోను పార్టీకి అండగా ఉంటూ బ్రాహ్మణయ్య ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి, రాష్ట్ర ప్రజలకు తీరని లోటన్నారు.

బ్రాహ్మణయ్య మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బ్రాహ్మణయ్య మృతదేహాన్ని హైదరాబాదు నుండి కృష్ణా జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఈ రోజు బ్రాహ్మణయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన విశాఖ నుండి విజయవాడకు బయలుదేరారు.

ఎమ్మెల్యే మృతి పట్ల స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీలు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, నటుడు బాలకృష్ణ సంతాపం తెలిపారు. బ్రాహ్మణయ్య మృతి పార్టీకి, జిల్లాకు తీరని లోటు అని కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు అన్నారు. గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యే, ఎంపీగా ఆయన ఎదిగారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+