కొత్త చిక్కులొద్దు!: మార్పులకు ఊహాగానాలకు చెక్

త్వరలో మంత్రివర్గ పునర్వ్వవస్థీకరణ, పిసిసిలో మార్పులు ఉంటాయని పార్టీలో ఒక వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. మంత్రివర్గంలో చోటును ఆశించిన పలువురు నేతలు ముఖ్య నేతలను కలుసుకున్నారు. ఇంకొందరు మంత్రులు తమకు మంచి శాఖలు కావాలంటూ అధిష్ఠానం పెద్దలకు సిఫార్సులు చేయించారు. అయితే, మంత్రివర్గ విస్తరణకు మాత్రం అధిష్టానం నో చెప్పడంతో వారు నీరుగారిపోయారట.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అభియోగాలు మోపిన మంత్రుల శాఖలను మారుస్తారని కొందరు, వారిని మంత్రివర్గం నుంచి తొలగించి వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటారని ఇంకొందరు భావించారు. హోంమంత్రిత్వ శాఖను కొందరు ఆశిస్తున్నారని కూడా ప్రచారం విస్తృతంగా జరిగింది. పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా ఢిల్లీలో సోనియా, ఇతర ముఖ్య నేతలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ ఆయనకు పిసిసిఅధ్యక్ష పదవిని ఇస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పట్లో ఎలాంటి మార్పులు చేసే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లుగా కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తగ్గట్లే కిరణ్, బొత్సలకు భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించింది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని సోనియా హితోపదేశం చేశారు.
కాగా, శనివారం ఢిల్లీలో సోనియా గాంధీతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. ఆమె నివాసంలోనే 20 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూర్పులో తన పాత్రను గురించి సోనియాగాంధీకి రాజనర్సింహ వివరించారు.












Click it and Unblock the Notifications