13ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్: ఆత్మహత్యాయత్నం

ఈ ఘటన ఇటీవలే బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు శనివారం చెప్పారు. బాధితురాలు తూర్పు ఢిల్లీలోని ఫార్ష్ బజారులో నివసిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం... పలువురు వ్యక్తులు గత నెల మార్చి 16వ తేదిన తన ఇంటి సమీపంలో ఉన్న బాధితురాలిని అపహరించారు.
అందులో ఓ వ్యక్తిని ఆమె నిత్యం అంకుల్ అంటూ పలకరిస్తుంది. ఆమెను అపహరించిన దుండగులు బలవంతంగా ఘజియాబాదులోని లోని ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అమ్మాయిని ఓ గదిలో బందించారు. తనను బందించిన వారిలో నలుగురు తెలిసిన వారిగా, నలుగురు తెలియని వారిగా ఆమె చెప్పింది.
గదిలో బంధించిన అమ్మాయిపై వారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12వ తేదిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిని కౌన్సెలింగ్ చేసిన తర్వాత పోలీసులు అత్యాచార కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
దీపక్(21), రంజిత్(20)లతో పాటు బాధితురాలికి తెలిసిన సోహన్ లాల్(24)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎవరో తెల్సుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలికపై నిందితులు తొమ్మిది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి గురైన ఈ టీనేజ్ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగిన ఈమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇంటెన్సివ్ కేర్‌లో ఉంది. గత రెండు రోజులుగా అత్యాచారం తాలుకు వార్తలు చూసిన ఆమె మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications