సిఎంలా ఫీలింగ్: హీరోలపై మోహన్‌బాబు, పార్టీపై సస్పెన్స్

Mohan Babu
హైదరాబాద్: తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోమవారం అన్నారు. మోహన్ బాబు కూడా ఉత్తర ప్రదేశ్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద దారిలోనే ఏ పార్టీలో చేరాలనే అంశంపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవల జయప్రద మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ఈ నెలాఖరులోగా చెబుతానని ప్రకటించారు. ఈరోజు మోహన్ బాబు కూడా తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని చెప్పారు. మేజర్ చంద్రకాంత్ సినిమా వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, పార్టీలో చేరే విషయం మాత్రం తర్వాత చెబుతానని అన్నారు. తనకు సొంతగా ఓ పార్టీని స్థాపించి ధైర్యం లేదన్నారు. పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే ధైర్యం లేదన్నారు. తాను పదవి కాంక్ష కోసం కాకుండా పార్టీ కోసం ప్రచారం చేస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు. పదవులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని మోహన్ బాబు చెప్పారు. ప్రస్తుతం హిట్లర్ లాంటి పాలకుడు కావాలన్నారు.

కేంద్రమంత్రి చిరంజీవి తన మిత్రుడే అన్నారు. తనకు అందరూ కావాల్సిన వారేనని, ఏ పార్టీలో చేరాలో సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతానన్నారు. చిరంజీవి హ్యాపీగా బాగా పని చేస్తున్నారని పత్రికలలో చూస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ విషయంలో కొందరి చెప్పుడు మాటలు విని దూరం కావాల్సి వచ్చిందే తప్ప ఆయనపై ప్రేమ లేక కాదన్నారు.

కుర్ర హీరోలపై సెటైర్లు

రాజకీయాలపై మాట్లాడిన మోహన్ బాబు కుర్ర హీరోలపై కూడా సెటైర్లు వేశారు. ఒక్క సినిమా హిట్ అయితే ముఖ్యమంత్రి అయినట్లు కొందరు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరన్నారు. తనకు వరుసగా హిట్లు వచ్చినా తాను ఎప్పుడు ఫీల్ కాలేదన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మోహన్ బాబు కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తానని ఈ రోజు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+