టార్గెట్ 2014: బాలకృష్ణ, నారా లోకేష్ బాధ్యతలపై చర్చ

Balakrishna and Nara Lokesh
హైదరాబాద్: ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండటంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించనున్న హీరో నందమూరి బాలకృష్ణ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాధ్యతలపై తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే పలు జిల్లాలను చుట్టి వచ్చారు. స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలో ఆయన మరింత క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్యకు ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఏ పదవి ఇవ్వాలనే చర్చ జోరుగా సాగుతోందట.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనే వాదన మొదటి నుండి ఉంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర మరో ఐదురోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత ఆయన పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. నేతలతో చర్చించిన అనంతరం బాలయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే ఎక్కువ అవకాశముందంటున్నారు.

మరోవైపు గత ఎన్నికల్లో నగదు బదలీ పథక రచన చేసిన నారా లోకేష్ కూడా త్వరలో పార్టీలో ఏదైనా బాధ్యత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయనను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబు పాదయాత్ర పూర్తయ్యాక బాలయ్య, లోకేష్ పదవుల అంశం, అభ్యర్థుల ఎంపిక విషయం క్రమంగా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+