జగన్‌తో ఎన్టీఆర్: వారు శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!(పిక్చర్స్)

హైదరాబాద్: పలువురు ప్రముఖులు ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల తూటాలు పేల్చుతూ నిత్యం మీడియాలో నానుతుంటారు. కొందరి మాటల దాడి చూస్తుంటే వైరి పక్షం నేతలతో ఎంతగానో శత్రుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య అప్పట్లో మాటల తూటాలు పేలేవి.

ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు బాగా పెరిగిపోయాయనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే జిల్లాకు చెందిన వీరు నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వైరం మాత్రం అంతెత్తున ఉంటుంది. కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను ఎలాగైనా దించాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అది కుదరక పోవడంతో ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ అయ్యారు.

వైరం లేకున్నా వేర్వేరు పార్టీలు, భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ప్రముఖులు ప్రత్యర్థులుగా ఇటీవల మీడియాలో నానుతున్నారు! నాగార్జున - బాలకృష్ణలు ఇటీవల జరిగిన ఫంక్షన్లో మాట్లాడుకోకపోవడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వారిద్దరి మధ్య ఏమీ లేకున్నప్పటికీ ఇటీవల టిడిపి నేతలు నాగార్జునను టార్గెట్ చేసుకోవడం, నాగార్జున జగన్ పార్టీకి సన్నిహితంగా ఉండటం వంటి కారణాల వల్ల నందమూరి - అక్కినేని కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు.

నిత్యం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు హీరో నందమూరి బాలకృష్ణకు పెద్ద అభిమాని అనే వాదనలు కూడా ఉన్నాయి. లగడపాటి రాజగోపాల్, కెసిఆర్ అప్పట్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా తర్వాత మాత్రం వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. పైగా ఒకరిపై మరొకరు ప్రేమ కురిపించుకున్నారు.

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

నాగార్జున - బాలకృష్ణలు ఇటీవల ఓ కార్యక్రమంలో ఎదురుపడ్డా మాట్లాడుకోలేదట. తనను టిడిపి టార్గెట్ చేసుకోవడం మింగుడుపడకనే బాలయ్యతో నాగార్జున మాట్లాడలేదట. అలాగే, జగన్ పార్టీతో నాగార్జున సన్నిహితంగా ఉంటున్నారనే వాదనల నేపథ్యంలో బాలయ్య గ్యాప్ పాటించారట.

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణకు మంచి అభిమాని అనే వాదనలు ఉన్నాయి. అదే నిజమైతే అభిమానం రాజకీయ పార్టీలు వేరైనా అభిమానం ఉండక మానదు!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

తెలంగాణ అంశం విషయంలో లగడపాటి రాజగోపాల్, కెసిఆర్‌ల మధ్య మాటల తూటాలు పేలుతాయి.

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ హస్తముందనే వాదన ఇప్పటికీ ఉంది. మావయ్య, బాబాయ్‌తో విభేదాల వల్లే జూనియర్ తన సన్నిహితుడైన నానిని బయటకు పంపించారట. వీటిని జూనియర్ కొట్టి పారేశారు కూడా. కట్టెకాలే వరకు టిడిపికే తన మద్దతు అని చెప్పిన జూనియర్‌కు జగన్‌తో లోపాయకారి సంబంధాలు లేకపోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ పరంగా మాత్రమే పైకి ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారంటున్నారు.

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

శత్రువులు కాదు..! ప్రత్యర్థులే..!!

పార్టీల పరంగా వేరైనా జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ కుటుంబాలు ఒకరి చిత్రాల ప్రారంభోత్సవానికి మరొకరు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+