మరో నిందితుడి అరెస్ట్: మనోజ్ సెల్‌లో పోర్న్ క్లిప్స్

మనోజ్ రేపిస్ట్
రెండు రోజుల క్రితం అరెస్టైన మనోజ్ కుమార్ సీరియల్ రేపిస్ట్ అని గుర్తించారు. శనివారం మనోజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని సెల్ ఫోన్‌లో దాదాపు పదిహేను పోర్న్ వీడియోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రేప్‌కు ముందు తాను పోర్న్ మూవీస్ చూసినట్లుగా మనోజ్ పోలీసులకు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇతను సీరియల్ రేపిస్ట్ అని పోలీసులు గుర్తించారు.
బీహార్‌లోని ఓ గ్రామంలో మనోజ్ గతంలోను అత్యాచారం చేశాడని అయితే, అత్యాచారం తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సమస్య పరిష్కారమయిందని పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మొదట అంగీకరించని మనోజ్ పోలీసుల వరకు వెళ్లకుండా ఉండేందుకు అంగీకరించాడు. ఇప్పుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక క్రమంగా కోలుకుంటోందని ఎయిమ్స్ వైద్యులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడుతోందని చెప్పారు. బాలిక క్రమంగా కోలుకుంటోందన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతోందని వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. చికిత్సకు ఆమె ప్రతిస్పందిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications