ఢిల్లీ రేప్: నేనెందుకు రాజీనామా చేయాలన్న కమిషనర్

తన రాజీనామాతో సమస్య పరిష్కారమవుతుందంటే వెయ్యిసార్లు రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఒక పత్రికా విలేకరి తప్పు చేస్తే సంపాదకులు రాజీనామా చేస్తారా? అన్నారు. చిన్నారిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అత్యాచార ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు వచ్చిన పోలీసులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులను వదిలి పెట్టేది లేదన్నారు.
తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేసారు. అంతకుముందు లెఫ్ట్ పార్టీ నేత బృందాకారత్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కమిషనర్ రాజీనామా చేయాలంటూ భారీగా ఆందోళనకారులు సోమవారం ఆయన కార్యాలయాన్ని ముట్టడించారు.
మెట్రో స్టేషన్ల మూసివేత
అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో మూసివేశారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఇండియా గేట్, రైజినా హిల్, రేస్ కోర్సు ప్రాంతాల్లోని స్టేషన్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications