షర్మిల సవాల్ స్వీకరిస్తున్నా, వస్తే ఆధారాలు: రేవంత్

కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని వారు తమ అధినేతకు సవాల్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకు సవాల్ విసిరే స్థాయి ఆమెకు ఇంకా రాలేదన్నారు. బయ్యారం గనులతో వారికి ఏ సంబంధం లేకుంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. రక్షణ స్టీల్స్, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల చిరునామాలు ఒకే చోట ఉన్నాయని విమర్శించారు.
బ్రదర్ అనిల్ కుమార్‌కు కొండల రావు బినామీయే అన్నారు. బినామీ కాకుండా ఆయనకు రూ.500 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేసే స్థోమత ఎక్కడ నుండి వచ్చిందో చెప్పాలన్నారు. బయ్యారం గనులపై చర్చకు షర్మిల వస్తే తాను ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అమ్మహస్తం ప్రచార హస్తమే.. గాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'అమ్మహస్తం' కార్యక్రమం కేవలం ప్రచారహస్తమే అని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయడు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అమ్మహస్తం పథకం ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను అందజేస్తానన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ పథకాన్ని కేవలం ప్రచారం కోసమే వాడుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు పొందడంలో విఫలమవుతుందని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు.












Click it and Unblock the Notifications