బయ్యారం: లగడపాటి తెలంగాణవాదం!, తాట తీస్తారని..

తెరాస ఉద్యమాలకు జనమే కరువయ్యారని విమర్శించారు. బయ్యారం గనుల విషయమై మాట్లాడుతూ... బయ్యారంలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో ప్రయివేటు కంపెనీలకు అప్పగిస్తే నోరు మెదపని కెసిఆర్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బయ్యారం గనుల విషయమై తెలంగాణ నేతలు బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మించాలని చెబుతుండగా సీమాంధ్ర నేతలు మాత్రం విశాఖకే అంటున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి బయ్యారంలో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పడం గమనార్హం.
కాంగ్రెసు పార్టీ ఒక్కరిపై ఆధారపడలేదు
కాంగ్రెసు పార్టీ ఏ ఒక్కరి పైనా ఆధారపడి లేదని లగడపాటి చెప్పారు. కొందరు నాయకులు పార్టీని వీడినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో వలసలు సాధారణమే అన్నారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం కాంగ్రెసు వెన్నంటే ఉంటారని లగడపాటి చెప్పారు.
కాగా అంతకుముందు బొత్స హైదరాబాదులో మాట్లాడుతూ... రక్షణ స్టీల్స్ డైరెక్టర్లు, కార్యాలయాల అడ్రసులు చూస్తే ఎవరివో తెలుస్తుందని అన్నారు. రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు వ్యవహారం మంత్రివర్గం దృష్టికి రాలేదన్నారు. ఉత్తర్వులు వచ్చినప్పుడు తనతో సహా కొందరు తప్పు పట్టారని, రక్షణ స్టీల్స్ ఎవరిదో, కొండల రావు ఎవరో అందరికీ తెలుసునని అన్నారు.












Click it and Unblock the Notifications