మొండోడా, కిరణ్ రెడ్డికి ఇంట్లోవాళ్లే భయపడరు: రోజా

Roja
హైదరాబాద్: మాట మాట్లాడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను మొండోడినని అంటారని, కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని చూసి నేరస్తులు కాదు కదా.. కనీసం ఇంట్లో వాళ్లు కూడా భయపడరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా వ్యక్తం చేశారు. కిరణ్ రెడ్డి ప్రజల నుంచి ఎన్నిక కాలేదని, అందుకే సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పాలకుల అసమర్థతే కారణమని రోజా అన్నారు. స్త్రీలు పొట్టి దుస్తులు ధరించడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయనడం సరికాదని, ఐదేళ్ల బాలిక, మానసిక స్థితి సరిగా లేని యువతి, 60 ఏళ్ల ముదుసలి ఎలా రెచ్చగొడతారని ప్రశ్నించారు. పబ్బుల్లో తిరిగే వారిని రేప్ చేయడం లేదని వ్యాఖ్యానించారు.

పరిచయం చేసుకోవడానికే...

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను, తన ముఖాన్ని ప్రజలకు పరిచయం చేసుకోవడం కోసమే ఇందిరమ్మ బాట, రైతు చైతన్య యాత్రలు పేరు మీద ప్రచార యాత్రలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. దీని కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బిజెపి ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణతో కలిసి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని మంగళవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరువు, ఆకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రైతు చైతన్యయాత్రల పేరుతో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.

ప్రచార హస్తం మాత్రమే..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'అమ్మ హస్తం' ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార హస్తం మాత్రమేనని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిత్యావసరాల ధరల తగ్గింపుపై దృష్టిపెట్టని సీఎం, 'అమ్మ హస్తం' గురించి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

వాస్తవానికి ఇది భస్మాసుర హస్తం పథకమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం కోట్లు వెచ్చించే బదులు నిత్యావసరాల ధరలు తగ్గించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అమ్మహస్తం పథకం కోసం సంచుల కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+