బాలికపై రేప్: లంచం ఇవ్వజూపిన పోలీసు దొరికాడు

విశ్వసనీయ సమాచారం ప్రకారం - పోలీసు స్టేషన్‌లోని 13 మంది పోలీసుల ఫొటోలను బాలిక తండ్రికి చూపించారు. వారిలో తమకు లంచం ఇవ్వజూపిన పోలీసును అతను గుర్తించాడు. తండ్రి అందుబాటులో లేనందున నిందితుడ్ని గుర్తించలేకపోయామని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ మంగళవారంనాడు చెప్పారు.
ఐదేళ్ల బాలికను ఈ నెల 15వ తేదీన అపహరించి, రెండు రోజుల పాటు బందీగా పెట్టుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. బాలిక కుటుంబం నివసించే అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నిందితులు కూడా ఉంటున్నారు. బాలిక అరుపులు విని ఆమెను ఈనెల 17వ తేదీన కుటుంబ సభ్యులు రక్షించారు.బాలికకు ఎయిమ్స్ చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక స్పృహ తప్పిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు కేసులో రెండో నిందితుడైన 19 ఏళ్ల ప్రదీప్ కుమార్ చెప్పాడు. ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ తొలుత నిందలన్నీ ప్రదీప్ కుమార్‌పైనే వేయడానికి ప్రయత్నించాడు. ప్రదీప్ కుమార్, మనోజ్ కుమార్ ఇద్దరు బాలికపై దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆత్యాచారం జరిపిన తర్వాత ఇద్దరు కూడా బీహార్‌లోని తమ సొంత పట్టణానికి పారిపోయారు. వారిని అరెస్టు చేసి పోలీసులు ఢిల్లీకి తీసుకుని వచ్చారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications