బంగ్గాదేశ్‌లో భవనం కూలి 70 మంది దుర్మరణం

శిథిలాల కింది నుంచి 50 శవాలను వెలికి తీసినట్లు కార్మి, ఉద్యోగాల కల్పన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇస్రాఫిల్ ఆలం చెప్పారు. పై అంతస్థు కూలుతున్నప్పుడు భవనంలో 2 వేల మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భవనంలో రెడీమేడ్ గార్మెంట్ ఫ్యాక్టరీ, బ్యాంకు కార్యాలయం, పలు దుకాణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.
శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సహాయక చర్యల కోసం సైన్యాన్ని పిలిపించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అడుగున చాలా మంది చిక్కుకుపోయి ఉంటారనే భావనతో సహాయక బృందాలు నీళ్ల సీసాలను, డ్రై ఫుడ్ ప్యాకెట్లను జార విడుస్తున్నాయి.
ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే, భవనం బీటలు వారినట్లు చెబుతున్నారు. 2005లో ఇదే ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల దుస్తుల కర్మాగారం కూలింది. ఈ సంఘటనలో 70 మంది మరణించారు. నిరుడు గార్మెంట్ ఫ్యాక్టరీలో మంటలు రేగడంతో 110 మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications