జగన్ పార్టీ కోసం పూర్తిగా పనిచేస్తా: నటుడు శ్రీహరి

'మా ఎమ్మెల్యే కనిపించడం లేదు' అని చెప్పుకునేటట్లు తన వ్యవహారం ఉండదని ఆయన తెలపారు. తనకు ఉన్న పలుకుబడితో ఎప్పుడైనా ఎమెల్యే కాగలనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయం తర్వలో చెబుతానని శ్రీహరి అన్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చలనచిత్ర నటుడు రియల్ స్టార్ శ్రీహరి ఫిబ్రవరి 8వ తేదీన కలిశారు.
తాను జగన్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు శ్రీహరి అప్పట్లో చెప్పారు. తాను రాజకీయాల్లో కూడా షేర్ ఖాన్‌గా నిరూపించుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. శ్రీహరి శాసనసభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరి హైదరాబాదులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శానససభకు పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications