కెసిఆర్‌కు చెక్: బిజెపిలోకి నాగం, కాంగ్రెస్‌పై నిప్పులు

బిజెపిలో చేరడం లేదని నేను చెప్పలేదే... నాగం
బిజెపికి మొదటి నుండి అనుకూలంగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు వెళ్లిన ఆయన జాతీయాధ్యక్షుడిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బిజెపిలో చేరడం లేదని ఎప్పుడు చెప్పలేదన్నారు. ఆ పార్టీలో చేరడంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
కాంగ్రెస్‌తో తెలంగాణ రాదని తేలిపోయింది
కాంగ్రెసు పార్టీతో తెలంగాణ రాదని తేలిపోయిందని, బిజెపి ద్వారానే సాధ్యమని నాగం ఈ సందర్భంగా అన్నారు. కేంద్రం తీరు చూస్తుంటే పార్లమెంటరీ వ్యవస్థ పైనే నమ్మకం పోయేలా ఉందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ అన్నారు. కాంగ్రెసుతో తెలంగాణ రాదని తేలిందన్నారు. తెలంగాణ కోసం వచ్చే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications