జూపార్క్‌లో ఆడ చింపాంజీ హల్‌చల్, ముగ్గురిపై దాడి

అడ్డొచ్చిన వారిని తరిమికొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ఇంటికి పంపించారు. రోజులాగానే బుధవారం ఉదయం కూడా ప్రసాద్ అనే యానిమల్ కీపర్ సందర్శకులు తిలకించేందుకు వీలుగా చింపాంజీలను ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్నారు.
సూజి అనే ఆడ చింపాంజీని ఎన్‌క్లోజర్‌లోకి వదిలి మరో చింపాంజీని వదలడానికి ఆయన ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సూజి ఎన్‌క్లోజర్ బోల్ట్‌ను తొలగించి బయటికి వచ్చేసింది. మెల్లగా ఫుడ్ కోర్టుకు చేరుకుంది. 15 నిమిషాల పాటు ఆవరణలో పరుగులు తీస్తూ అడ్డు వచ్చిన జూ కాంట్రాక్టు కూలీలు సుశీలమ్మ, బుజ్జి, ముస్తాక్‌లను గాయపరిచింది.
ఇంతలో జూ వెటర్నరీ సిబ్బంది అక్కడికి చేరుకొని చింపాంజీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు. చింపాంజీ హల్ చల్ చేసే సమయానికి సందర్శకులు పూర్తిస్థాయిలో రాకపోవడం, అప్పుడే వస్తున్నవారిని కూడా జూ సిబ్బంది అటువైపు వెళ్లకుండా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications