అడ్రస్ పేరుతో కార్లోకి లాక్కొని తాగించి యువతిపై ఘోరం

పోలీసుల కథనం ప్రకారం బెంగళూరులోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని (19) ఆదివారం తాను ఉంటున్న హాస్టల్ నుంచి అశోక్ నగర పోలీస్ స్టేషన్ సమీపంలోని బస్‌స్టాప్‌కు బయలుదేరింది. ఆ సమయంలో తెలుపు రంగు స్కార్పియో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె పక్కన కారు ఆపి అడ్రస్ అడుగుతూ కారులోకి లాక్కొన్నారు.
కారులోనే ఆ యువతిని లైంగికంగా వేధించారు. ఆపై నిర్జన ప్రదేశంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి బాధితురాలిని చితకబాది, బలవంతంగా మద్యం తాగించి మళ్లీ సామూహిక అత్యాచార యత్నం చేశారు. చివరకు స్పృహ కోల్పోయిన ఆమెను అక్కడ వదిలి పరారయ్యారు. చాలాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువతి తీవ్ర గాయాలతో లేవలేకపోయింది.
తర్వాత హాస్టల్‌కు చేరుకున్న యువతిని సోమవారం సాయంత్రం వార్డెన్, ఆమె స్నేహితులు సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. కారులో, ఇంట్లో గ్యాంగ్‌రేప్ చేశారంటూ బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications