ప్రధాని పీఠంపై ఆశలు వీరికే!: చిట్టా పెద్దదే(పిక్చర్స్)
న్యూఢిల్లీ: 2014 ఎన్నికలలో ప్రధాని పీఠం ఎక్కాలని కలలు కంటున్న వారు చాలామందే ఉన్నారు. మనసులోని మాటను బయట పెట్టనప్పటికీ రేసులో ఉంటూ ఆ పీఠంపై ఆసక్తి కనబరుస్తున్నా వారు పలువురు ఉన్నారు. ఆయా పార్టీలు, ఫ్రంట్‌ల నుండి ప్రధాని రేసులో పలువురు ముందంజలో ఉన్నారు.
ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, యూపిఏ నుండి నుండి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి చిదంబరం, మూడు లేదా నాలుగో ఫ్రంట్ వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, శరద్ పవార్, బిఎస్పీ అధినేత్రి, యుపి మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఎన్డీయే తరఫున మోడీకి ఎంత గట్టి మద్దతుందో అంతే వ్యతిరేకత కూడా ఉంది. యూపిఏలో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వానికి అన్ని పక్షాలు మొగ్గు చూపుతాయి. అయితే, చిదంబరం కూడా రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆయా రాష్ట్రాల పార్టీ నేతలు ఫ్రంట్‌ల ద్వారా పిఎం పీఠం కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీయే తరఫున పిఎం రేసులో అందరికంటే ముందున్నారు. జెడి(యు) మోడీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. దీంతో అన్ని పార్టీలను సమన్వయపర్చేందుకు బిజెపి కృషి చేస్తోంది.

మోడీ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ కూడా రేసులో ఉన్నారు. ప్రధాని పీఠం ఆయన కల! అయితే, కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు వెనక్కి వెళ్లినప్పటికీ ఇటీవల జెడి(యు) మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే అద్వానీ పేరు సూచించింది

ఎన్టీయేలో సుష్మా స్వరాజ్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. కొద్ది నెలల క్రితం సుష్మా అసలైన ప్రధాని అభ్యర్థి అని కొన్ని మిత్రపక్షాలు కితాబిచ్చాయి.

మోడీని అంగీకరించమని చెబుతున్న బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారు. మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా, 2014 ఎన్నికల్లో తన కల నెరవేరేలా ఫ్రంట్ వైపు ఆయన వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మాయావతి, ములాయం సింగ్ యాదవ్‌లు థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌ల పైన ఆశలు పెట్టుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఈ రేసులో ఉన్నారు. కానీ, పోటా పోటీ నేపథ్యంలో ఆమె పేరు వెనక్కి వెళ్తోంది.

శరద్ పవార్, చిదంబరంలు ప్రధాని పీఠం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారిలో ఉన్నారు.

2014 ఎన్నికల్లో యూపిఏ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications