యువతికి మెసేజ్‌లు: మాగంటి కొడుకు అరెస్టుకు రంగం

మాగంటి రామ్‌జీ వేధించింది దూరపు బంధువైన ఓ యువతినే అని విచారణలో తేలినట్లుగా సమాచారం. అతనిపై 506, 509, ఐటి యాక్టు సెక్షన్‌ల కింద సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీంతో పోలీసులు అరెస్టు కోసం పశ్చిమ గోదావరికి చేరుకున్నారు.
తనను ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ హైదరాబాదుకు చెందిన ఓ యువతి మార్చి 15వ తేదిన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు నిత్యం ఈమెయిళ్లో అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బాధిత యువతి గతంలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఆమెను వేధిస్తున్నది మాగంటి రామ్‌జీ అని గుర్తించారు. దీంతో మాగంటి రామ్‌జీని అరెస్టు చేసేందుకు పోలీసులను పశ్చిమ గోదావరిలోని ఏలూరుకు పంపించారు.












Click it and Unblock the Notifications