సిఎం సభ: దామోదర అలక, వెళ్లను కానీ.. కోమటిరెడ్డి

తాను ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనుక వ్యక్తిగత కారణాలే తప్ప రాజకీయ దురుద్దేశ్యం లేదని చెప్పారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి తాను ముఖ్యమంత్రిని ఆహ్వానించానన్నారు. జిల్లా రాజకీయాలపై ఆయనతో చర్చించినట్లు చెప్పారు.
కిరణ్‌పై డిప్యూటీ అసంతృప్తి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు కిరణ్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పర్యటనలో పాల్గొనాలని దామోదరకు కిరణ్ సూచించారు. అయితే తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని చెబుతూ దామోదర హాజరయ్యేది లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో దామోదర రాజనర్సింహ, మంత్రులు డికె అరుణ, రఘువీరా రెడ్డి, గీతా రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications