కర్ణాటక ప్రపంచ రికార్డు: రాహుల్, గాలి బ్రదర్స్‌పై ఫైర్

rahul gandhi
బెంగళూర్: కర్ణాటక బిజెపి ప్రభుత్వంపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దాడిని పెంచారు. అవినీతిలో కర్ణాటక ప్రపంచ రికార్డును సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హవేరీలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలో అవినీతి గురించి బిజెపి మాట్లాడుతోందని, కానీ కర్ణాటకలోని అవినీతి బిజెపి దృష్టికి రావడం లేదని ఆయన అన్నారు.

అవినీతి విషయంలో కర్ణాటక ప్రపంచ రికార్డును సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, బిజెపి నేతలు పరస్పర విమర్శల్లో మునిగిపోయారని, నేతలు డబ్బుల కోసం పోరాడుతున్నారని ఆయన అంటూ అటువంటి ప్రభుత్వం మీకు కావాలా అని అడిగారు.

బళ్లారి సోదరుల ధనాధిక్యతతో బిజెపి 2008 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందని ఆయన గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. ముడి ఇనుమను తవ్వి, చైనాకు ఎగుమతి చేసి వారు డబ్బులు చేసుకున్నారని, దాంతో బలం పెంచుకున్నారని ఆయన ఆరోపించారు.

బెంగళూర్ ఐటి రంగం ప్రపంచ బ్రాండ్‌గా ఉండేదని, బిజెపి - జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో, ఆ తర్వాత బిజెపి పాలనలో బెంగళూర్ గత ఎనిమిది, తొమ్మిదేళ్ల నుంచి తన ఆధిక్యతను కోల్పోతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+