వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో యుపి మంత్రి ఆజంఖాన్‌కు అవమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Azam Khan
లక్నో: ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం‌ఖాన్‌కు అమెరికాలో అవమానం జరిగింది. అమెరికాలోని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో ఆయనను పరాభావానికి గురి చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మహాకుంభ్‌పై ప్రసంగించడానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో వెళ్లిన ఆజం ఖాన్ పరాభవాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి వచ్చారు.

పరాభవానికి మంత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగం చేసిన వెంటనే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చారని ఆజంఖాన్ సమాచార అధికారి ఖుర్షీద్ అహ్మద్ గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. అమెరికాలోని అన్ని ఇతర కార్యక్రమాలను ఆజంఖాన్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు.

దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నప్పటికీ బోస్టన్ విమానాశ్రయానికి చెందిన అధికారులు ఆజంఖాన్‌ను వివిధ రకాల ప్రశ్నలతో వేధించారని తెలుస్తోంది. తాను ముస్లింను కాబట్టే తనను వేధించారని ఆజంఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వినోదానికి అమెరికా పర్యటనకు వెళ్లలేదని, కుంభమేళాను తాము ఎలా నిర్వహించామనే విషయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగం చేయడానికి ఆహ్వానిస్తే తాను వెళ్లానని వివరించారు.

అమెరికాలో భారతీయులను అవమానించడం ఇదే మొదటిసారి కాదు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్‌కు కూడా ఆ బాధ తప్పలేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు కూడా అవమానం జరిగింది. మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కూడా గతంలో అవమానానికి గురయ్యారు. సోదా పేరుతో అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో భారత రాయబారి మీరా శంకర్‌ను కూడా అమెరికా అధికారులు అవమానించారు.

English summary

 Uttar Pradesh (UP) minority welfare minister and senior Samajwadi Party (SP) leader Azam Khan was allegedly subjected to humiliation at Boston's Logan Airport in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X