కారు బోల్తా: తెరాస ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Kaveti Sammaiah
అదిలాబాద్/విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకు ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన పార్టీ 13వ ఆవిర్భావ సభకు వెళ్లి తిరిగి వస్తున్న కావేటి సమ్మయ్య వాహనం ప్రమాదానికి గురైంది. అదిలాబాదు జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యేకు చెందిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి బోర్లా పడింది.

ఎదురుగా దుప్పి రావడంతో ఇది జరిగింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. ఎమ్మెల్యేతో సహా తొమ్మిది మంది ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సింహాద్రి అప్పన్నను దర్సించుకున్న బాలయ్య, చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణలు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలోని ప్రముఖ సింహాద్రి అప్పన్న స్వామి వారిని దర్సించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.

ఆనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహగిరి పైనే చంద్రబాబు మధ్యాహ్నం భోజనం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం చంద్రబాబు తిరిగి హైదరాబాదుకు బయలుదేరుతారు. చంద్రబాబు రాక కోసం రాష్ట్ర రాజధానిలో కార్యకర్తలు, నాయకులు ఏర్పాట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+