జగన్, హరి, తెలంగాణ: బాలకృష్ణ ముందు సవాళ్లు

Balakrishna
హైదరాబాద్: నందమూరి హీరో బాలకృష్ణ రాజకీయాల్లో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తప్పనిసరిగా ఆ సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఆ సవాళ్లను అధిగమించి బావ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబు నాయుడి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాల్లో నటిస్తూనే రాజకీయ సవాళ్లకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను ఢీకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్‌నే విసిరింది. పార్టీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసులోకి వలస పోతున్నారు. ఈ స్థితిలో ఆయన రాజకీయాల్లో ఆ పార్టీలను ఎలా ఎదుర్కుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెసు పార్టీని ఆయన ముందుండి ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఆయన ఎలా ఎదుర్కుంటారనేది సమస్యగానే ఉంది. తెలంగాణవాదాన్ని అధిగమించి, తెలంగాణలో ఆయన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించగలరా అనేది సమస్య. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా సీమాంధ్రలోనే తిరిగారు. తెలంగాణలో ఆయన ఇంకా అడుగు పెట్టలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో అడుగు పెట్టక తప్పదు. ఈ సమయంలో ఆయనకు ఏ విధమైన ఆదరణ లభిస్తుందనేది చూడాల్సిందే.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉన్నాయి. కానీ, తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరిపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని బాలకృష్ణ కూడా గతంలో అన్నారు. కానీ, స్పష్టంగా తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు. దీంతో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముందుకు నడిపించగలరా అనేది ప్రశ్న.

అన్నిటికన్నా ముఖ్యమైంది - పార్టీలోని అంతర్గత పోరు. నందమూరి, నారావారి కుటుంబాల మధ్య నెలకొన్న వారసత్వ పోరులో బాలకృష్ణ చంద్రబాబు వైపు చేరిపోయారు. హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును, బాలకృష్ణను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంతర్గత సమస్యను బాలకృష్ణ ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను విస్మరించే ధోరణి అవలంబించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, బాలకృష్ణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికకు ప్రతిస్పందించిన జూనియర్ ఎన్టీఆర్ అసలు సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు. ఏమైనా, బాలకృష్ణ ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు తెలుగుదేశం పార్టీని గట్టెక్కిస్తుందనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+