అలక వీడిన కడియం: టిడిపిని వీడనని ప్రకటన

Kadiyam Srihari
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి అలక వీడారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. టిడిపి నుంచి వెళ్లిపోతానంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను టిడిపిని వీడి ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన అలక వహించిన మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ నేత కడియం శ్రీహరి బుజ్జగింపు బాధ్యత జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు తీసుకున్నారు. అలకబూనిన కడియంను బుజ్జగించాలని ఎర్రబెల్లికి చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. ఆ బాధ్యతను ఎర్రబెల్లి పైనే వేస్తున్నట్లుగా చెప్పారు.

దీంతో రంగంలోకి దిగిన ఎర్రబెల్లి సహచర నేతను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని కడియంకు ఎర్రబెల్లి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నాలు ఫలించాయి.

పార్టీకి చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో వచ్చిన విభేదాల కారణంగా కడియం కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉంటున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభలో కూడా కడియం శ్రీహరి పాల్గొనలేదు. దీంతో ఎర్రబెల్లిని రంగంలోకి దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+