ఎర్రబెల్లికి బుజ్జగింపు: కడియం అలకపాన్పు వీడినట్లేనా?

Kadiyam Srihari and Errabelli Dayakar Rao
హైదరాబాద్/వరంగల్: తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన అలక వహించిన మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ నేత కడియం శ్రీహరి బుజ్జగింపు బాధ్యత జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు తీసుకున్నారు.

అలకబూనిన కడియంను బుజ్జగించాలని ఎర్రబెల్లికి చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. ఆ బాధ్యతను ఎర్రబెల్లి పైనే వేస్తున్నట్లుగా చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన ఎర్రబెల్లి సహచర నేతను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారట. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని కడియంకు ఎర్రబెల్లి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కడియం కూడా అలక వీడారని తెలుస్తోంది.

పార్టీకి చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో వచ్చిన విభేదాల కారణంగా కడియం కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉంటున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభలో కూడా కడియం శ్రీహరి పాల్గొనలేదు. దీంతో ఎర్రబెల్లిని రంగంలోకి దించి అలక పాన్పు దించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు విశాఖపట్నానికే చెందిన సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు దాడి వీరభద్ర రావు కూడా విశాఖ సభకు దూరంగా ఉన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనందుకు ఆయన చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. దాడి అలకపాన్పును ఎవరు దూరం చేస్తారో..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+