అనుమానం: పోలీసు భర్తను చంపిన రెండో భార్య

తనకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నందకిశోర్ మూడు రోజులుగా తనతో గొడవ పడుతున్నాడని, ఆదివారం సాయంత్రం 3 గంటలకు మరోసారి తమ మధ్య గొడవ జరిగిందని పార్వతి చెప్పింది. నందకిశోర్‌కు పరిచయం లేని ఓ వ్యక్తి నుంచి ఫోన్ రావడమే గొడవకు కారణమైంది.
ఆదివారంనాడు గొడవ తీవ్ర రూపం దాల్చిందని, దీంతో నందకిశోర్ తలపై సుత్తితో కొట్టి, ఆ తర్వాత గ్రైండింగ్ స్టోన్‌తో క్రష్ చేసినట్లు ఆమె తెలిపింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ముందు గంటన్నర పాటు ఇంట్లోనే ఉండిపోయింది.
నందకిశోర్ హత్యకు వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానంతో పాటు ఇతర కారణాలు కూడా ఉండవచ్చునని పోలీసు అధికారులు అంటున్నారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
నందకిశోర్ 1996 - 97 బ్యాచ్ పోలీసాఫీసరు. 2006లో మొదటి భార్యకు అతను దూరమయ్యాడు. వరకట్నం వేధింపుల ఆరోపణలపై వారిద్దరు విడిపోయారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగులో ఉంది. ఆ ఫిర్యాదు కారణంగా నందకిశోర్‌ను శివాజీ పార్కు పోలీసు స్టేషన్ నుంచి మరోల్ స్థానిక సాయుధ విభాగానికి బదిలీ చేశారు.
నందకిశోర్ పార్వతితో కలిసి 2007 నుంచి మరోల్ పోలీసు శిక్షణా శిబిరంలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వారు 2012 డిసెంబర్ 7వ తేదీన వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. తాను మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు నందకిశోర్ అబద్ధం చెప్పాడనేది పార్వతి ఆరోపణ.












Click it and Unblock the Notifications