అక్కడ తెలుగోడి ప్రచారం, హీరోయిన్లు ఎక్స్‌ట్రా(పిక్చర్స్)
బెంగళూరు: మే 5వ తేదిన కన్నడనాట జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. కర్నాటక - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుతో పాటు రాష్ట్రంలోను తెలుగు ఓటర్లు చాలామంది ఉంటారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
కేంద్రమంత్రి చిరంజీవి ఆదివారం పావగడ, చిక్‌బళాపూర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెసు తరఫున జోరుగా ప్రచారం చేశారు. చిరంజీవి ప్రచారానికి జోరుగా అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన సభకు వచ్చిన వారిని పోలీసులు అదుపుచేయలేక లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ అజహరుద్దీన్ కూడా బళ్లారి జిల్లా హోస్పేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెసు అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి హైదరాబాదు నుండి వచ్చానని, ఇంత దూరం వచ్చినందుకు అభ్యర్థిని గెలిపించి, తనను కూడా గెలిపించాలన్నారు. మధ్యలో మాత్రం తనను రనౌట్ చేయవద్దని చలోక్తి విసిరారు.
చిరంజీవి, అజహరుద్దీన్‌తో పాటు మంత్రి రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనంటారని చెబుతున్నారు. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని సుమలత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సుమలత భర్త అంబరీష్ కాంగ్రెసు తరఫున మాండ్య నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనను గెలిపించేందుకు ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. కన్నడనాట ప్రముఖ నటీనటులు కూడా ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు. నటీనటుల ప్రచారం తమకు అదనంగా కలిసి వస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కన్నడనాట కాంగ్రెసు పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ర్యాలీలకు, సభలకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిరు సభలకు వస్తున్న జనాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీఛార్జీ కూడా చేయాల్సి వస్తోంది.

హైదరాబాదుకు చెందిన మాజీ భారత క్రికెట్ సారథి మహమ్మద్ అజహరుద్దీన్ కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు. ఆయన తన ప్రచారంలో చలోక్తులు విసురుతూ ఆకట్టుకుంటున్నారు.

తెలుగు సినీ అభిమానులకు బాగా పరిచయమున్న సుమలత కర్నాటకలో తన భర్త గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమెతో పాటు నటుడు దర్శన్ కూడా పాల్గొన్నారు.

మంత్రులు రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితరులు సరిహద్దు జిల్లాల్లో, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు.

నటి రమ్య కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె ఆదివారం బెంగళూరులో ప్రచారం చేశారు.

ఉల్లాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రముఖ నటి భావన కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున మల్లేశ్వరంలో ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications