అది ఫ్యాక్షనిజమే: జగన్ భార్య భారతిపై ముప్పేట దాడి

వైయస్ భారతి మాటలు దర్యాఫ్తు అధికారులను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఎంతో మంది బలయ్యారన్నారు. వారి పిల్లలు భారతికి గుర్తుకు లేదా అన్నారు. జగన్ కేసులో భారతిని కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.
బెదిరింపులవల్లే... కోడెల
వైయస్ భారతి రెడ్డి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని గుంటూరులో టిడిపి నేత కోడెల శివప్రసాద్ అన్నారు. భారతి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలన్నారు. జగన్ అవినీతిపరుడు కాదని వైయస్ కుటుంబ సభ్యులు బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
జగన్ అవినీతిపరుడు అని తాను ప్రమాణం చేసి చెబుతానని సవాల్ చేశారు. విచారణాధికారులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆరోపించారు. వైయస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన సూరీడుని బెదిరించడం వల్లే ఆయన సాక్ష్యం చెప్పలేదన్నారు. జగన్ బయటకు వస్తే సాక్ష్యులను బెదిరిస్తారన్నారు.












Click it and Unblock the Notifications