చదివేది ఇంజనీరింగ్: చేసేవి కిడ్నాప్‌లు, జల్సాల కోసం

వివరాలు ఇలా ఉన్నాయి - కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బోయ మండ్ల సునీల్ ముఠా నాయకునిగా వ్యవహరిస్తున్నాడు. నేర చరిత్ర కలిగిన సునీల్ మరికొంత మంది యువకులను కలుపుకుని ముఠా కట్టాడు. మూడు జిల్లాల్లో సమాచారం సేకరించేందుకు మరో వంద మందిని నియమించుకున్నారు. వీరిచ్చే సమాచారం మేరకు వ్యాపారులు, ధనవంతులను కిడ్నాప్ చేసి వారి కుటుంబసభ్యుల నుంచి తెలివిగా డబ్బు వసూలు చేసేవారు. ఇలా ఇప్పటి వరకు సుమారు రూ.కోటి వరకు నగదు, బంగారం వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీవ్రంగా హింసించి అతని సెల్‌ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేయించి వ్యాపారం నిమిత్తం సొమ్ము అవసరమని, తాను పంపుతున్న యువకుడితో డబ్బు పంపించాలని చెప్పించే వారు. దీంతో కిడ్నాప్ విషయం బయటకు పొక్కకుండా సొమ్ము చేతికి వచ్చేది. ఇలా ముఠా సభ్యులు పలువురిని కిడ్నాప్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వ్యాపారి వాసు రాంప్రసాద్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అతడిని తీవ్రంగా హింసించగా ప్రాణాలు వదిలాడు.
ప్రసాద్ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా సునీల్ ముఠా గుట్టు రట్టయింది. దీంతో పోలీసులు ముఠా కదలికలపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో సునీల్‌తో పాటు పైడికాల్వ శిశువ అలియాస్ విశ్వ, తరిమెళ్ల నరేంద్రకుమార్, ఊట్కూరు హరీష్‌కుమార్‌రెడ్డి, కదిరి కిరణ్‌కుమార్‌రెడ్డి, బసవయ్య మహేష్‌కుమార్‌రెడ్డి, గండ్లూరి షామీర్‌బాషా, కోలాట సుబ్రమణ్యం, సూర అశోక్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 3 ఖరీదైన వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, కొంత నగదు, బంగారం, హత్యకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications