మోసమంటూ ఎస్సై ప్రియుడిపై ఓ ప్రియురాలి ఫిర్యాదు!

ప్రస్తుతం విజయ్ కుమార్ ప్రకాశం జిల్లాలో ఎస్సైగా పని చేస్తున్నారు. ఐదేళ్లుగా ఎస్సై తనకు తెలుసునని, అప్పటి నుండి ప్రేమించికుంటున్నామని చెప్పారు. ఆయన కానిస్టేబుల్‌గా ఉన్నప్పటి నుండే పరిచయమని చెప్పారు. ఇటీవల ఎస్సైగా ప్రమోషన్ రావడంతో పెళ్లికి నిరాకరించారని చెబుతున్నారు.
తనకు అప్పు ఉందని, ఆ అప్పు తీర్చాలంటే డబ్బున్న అమ్మాయి కావాలని తనతో ఎస్సై చెప్పారని యువతి ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు ప్రేమించిన తననే డబ్బు కోసం వదులుకున్నారని, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటున్నారని తెలిసిందని, ఆ యువతి తనలా బలికావద్దని తాను బయటకు వచ్చానని చెబుతున్నారు. ప్రియురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రియుడిపై ప్రియురాలి బంధువుల దాడి
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుంజారంలో ప్రియుడి పైన ప్రియురాలి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
తండ్రిని చంపిన కొడుకు
కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రినే ఓ కొడుకు దారుణంగా చంపాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రెడ్డివారిపాలెంలో చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతని కొడుకు సోమవారం రాత్రి గొంతుకోసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications