బోగ్గు స్కామ్ ప్రకంపనలు: హరీన్ రావల్ రాజీనామా

బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో రావల్, వాహనవతిల కెరీర్‌పై కూడా నీలినీడలు పరుచుకున్నాయి. కోల్ బ్లాక్‌లో కేటాయింపు వ్యవహారంలో సిబిఐ దర్యాప్తును ప్రభావితం చేయడానికి వాహనవతి ప్రయత్నిస్తున్నారని రావల్ సోమవారం విమర్శించారు.
కోల్ గేట్ స్కామ్ విషయంలోనే కాకుండా సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఇతర కుంభకోణాల కేసుల్లో ఆటార్నీ జనరల్ వాహనవతి నీడ పడుతోందని ఆరోపిస్తూ ఆయన లేఖ రాశారు. ఆరోపణలు చేస్తూ రావల్ అటార్నీ జనరల్ వాహనవతికి లేఖ రాశారు. ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)పై రాజకీయ ఒత్తిళ్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం స్పందించిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంపై సుప్రీం కోర్టులో ఉదయం విచారణ ప్రారంభమైంది. బొగ్గు కుంభకోణంపై సిబిఐ అఫిడవిట్ గందరగోళంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications