ఇంటర్నెట్లో వీర్యం కొని కూతుర్ని గర్భవతిని చేసిన తల్లి

ఇంకా పిల్లలు కావాలని కోరుకుంది. దీంతో ఇంటర్నెట్‌లో వీర్యాన్ని కొనుక్కుంది. సిరంజి ద్వారా ఎక్కించి, తన పెద్ద కూతురును గర్భవతిని చేయాలని భావించింది. కూతురుపై ఒత్తిడి తీసుకు వచ్చింది. వీర్యాన్ని ఆమెకు ఎక్కించింది. మొదటిసారి గర్భం నిలబడలేదు.
దీంతో మరోసారి వీర్యాన్ని తన కూతురుకు ఇచ్చింది. రెండోసారి అది ఫలించింది. పదహారేళ్లకు ఆ యువతికి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది బయటకు తెలియడంతో కోర్టుకు ఎక్కింది. హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. మీడియా హడావుడి కారణంగా కేసు వివరాలను న్యాయమూర్తి తెలిపారు.
ఈ రహస్య కేసు వివరాలను న్యాయమూర్తి సోమవారం బయటకు చెప్పారు. కోర్టు నిందితురాలి పేరును వెల్లడించలేదు. ఆ తల్లికి ఇటీవలే ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. గత రెండేళ్లుగా యువతిని తల్లి వీర్యం కోసం వేధించిందట. ఇది స్థానిక దినపత్రికలలో వచ్చింది.












Click it and Unblock the Notifications